బ్రేకింగ్ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదు…చెప్పిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. కేంద్ర [more]

Update: 2021-03-23 08:39 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ సమాధానం చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. విభజన హమీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అవకాశముందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని రాష్ట్రాలే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News