రాయితీపై రైల్వే శాఖ కీలక నిర్ణయం

వృద్ధులకు రైల్వే ప్రయాణాల్లో రాయితీ కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

Update: 2022-07-27 13:10 GMT

వృద్ధులకు రైల్వే ప్రయాణాల్లో రాయితీ కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కొన్ని మార్పులు చేస్తూ రాయితీలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వయసు కూడా రాయితీ విషయంలో పెంచింది. ఇప్పటి వరకూ 58 ఏళ్లకే రాయితీలను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై దానిని 70 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్ల వయసు ఉన్న వారికే రైల్వే ప్రయాణీల్లో ఇకపై రాయితీలు లభిస్తాయి.

70 ఏళ్లకే...
అంతే కాకుండా జనరల్, స్లీపర్ క్లాసులకే రాయితీలను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల వృద్ధులకు రైల్వేలో రాయితీలు కల్పించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. రాయితీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై దేశంలో అనేక స్థాయిల్లో అభ్యంతరాలు, విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. 70 ఏళ్ల వయసున్న వారికే రైల్వేలో రాయితీలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News