IPL 2025 : నిరాశపర్చిన రాయల్స్... నైట్ రైడర్స్ దే విజయం

గౌహతిలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మీద విజయం సాధించింది.;

Update: 2025-03-27 01:35 GMT
kolkata knight riders,  rajasthan royals, IPL 2025, guwahati
  • whatsapp icon

ఐపీఎల్ సీజన్ 18 ప్రారంభమయిన తర్వాత తొలి సారి ఎలాంటి ఉత్కంఠ లేకుండా మ్యాచ్ జరిగింది. సులువుగా గెలుపు సాధించింది. నిన్న గౌహతిలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మీద విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ను నైట్ రైడర్స్ బ్యాటర్లు త్వరగా పెవిలియన్ బాట పట్టించారు. ఎవరినీ క్రీజు మీద నిలబడకుండా చేయగలిగారు. వరుణ్ చక్రవర్తి, మొయిన్ ఆలీ, వైభవ్ ఆరోరాలు తలో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్ లోనే అతి తక్కువ పరుగులు చేయగలిగింది. ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది.

నిరాశపర్చి...
రాజస్థాన్ రాయల్స్ జట్టులో అందరూ వరస పెట్టి అవుట్ కావడంతో ఆ జట్టు ఫ్యాన్స్ ను నిరాశపర్చారు. యశ్వంత్ జైశ్వాల్, సంజూ శాంసన్ తో పాటు మిగిలిన ఆటగాళ్లు కూడా వరసగా అవుట్ కావడంతో మిగిలిన బ్యాటర్లపై వత్తిడి పడింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఒక్క ధ్రువ్ జురెల్ మాత్రమే 33 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడంటే ఏ మాత్రం బ్యాటర్లు రాణించారో అర్థం చేసుకోవచ్చు. ఎవరూ కొద్ది సేపు కూడా క్రీజులో నిలబడలేకపోవడంతో తక్కువ స్కోరుకే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిస్తుందన్న అంచనాలు నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే 151 పరుగులు మాత్రమే చేయడంతో అతి తక్కువ లక్ష్యాన్ని ఛేదించడం కోల్ కత్తా నైట్ రైడర్స్ కు పెద్ద కష్టమేమీ కాలేదు.
సులువుగానే...
తర్వాత బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ కేవలం 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. నైట్ రైడర్స్ బ్యాటర్లలో డీకాక్ ఒక్కడే 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఎనిమిది ఫోర్లు కొట్టి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ వరసగా ఐపీల్ సీజన్ లో రెండో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ మీద మంచి ప్రతిభను కనపర్చిన జట్టు గౌహతిలో మాత్రం తక్కువ పరుగులు చేయడంతో పాటు అందరినీ నిరాశపర్చింది. మంచి బ్యాటర్లున్నప్పటికీ నిలదొక్కుకోలేకపోవడంతో ఆ జట్టు అపజయం ముందే ఖాయమం అయింది. డీకాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.


Tags:    

Similar News