Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది;

బంగారం ధరలకు రెక్కలుంటాయి. గత కొంత కాలం నుంచి స్వల్పంగానైనా తగ్గుతూ వినియోగదారులకు ఊరట కల్గిస్తున్న బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేమని అంటున్నారు. బంగారం పై మదుపు చేయడం అంటే దానికి మించిన సురక్షితమైనది మరొకటి లేదు. బ్యాంకుల్లో ఇచ్చే వడ్డీ కంటే, ఫిక్సడ్ డిపాజిట్ పై లభించే ఆదాయం కంటే అంతకు మించి బంగారం పై వస్తుండటంతో ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేసి తమ డబ్బును రెట్టింపు చేసుకోవడానికి ఆశపడుతుంటారు. అందుకే గోల్డ్ వల్ల ఎప్పటికీ నష్టం రాదన్న భావన అందరిలోనూ ఉంది. అందుకే బంగారాన్ని కొనుగోలు చేసేవారిలో 60 శాతం మంతి పెట్టుబడి కోసమేనని వ్యాపారులు కూడా చెబుతున్నారు.
అవసరాల కోసమే...
మిగిలిన నలభై శాతం మంది తమ అవసరాల కోసం పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేస్తుంటారు. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గుతుండటంతో ఇంకా ధరలు తగ్గుతాయేమోనని కొందరు చూస్తున్న ఎదురు చూపులకు నిరాశ ఎదురు కాక తప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగని బంగారం ధరలు మరింతగా పెరుగుతాయని అందులో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడం కూడా సరికాదని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయని అదే రకంగా ధరలు పెరుగుతాయని భావించవద్దని కూడా అంటున్నారు. బంగారం, వెండి ధరలు అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గి తమ వ్యాపారాలు మందగిస్తాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
భారీగా పెరిగి...
బంగరాన్ని స్టేటస్ సింబల్ గా చూసే వారు ఎక్కువగా మారారు. జ్యుయలరీని దిగేసుకుని పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళితే తమకు లభించే గౌరవం వేరుగా ఉంటుందన్న భావనతో నే ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై నూట ఇరవై రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై 1200 రూపాయల వరకూ పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,960 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89, 410 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,11,100 రూపాయలకు చేరుకుంది.