Modi : దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం దీపావళి బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోలుపై ఐదు [more]

Update: 2021-11-03 14:52 GMT

కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోలుపై ఐదు రూపాయలు, డీజిల్ పై పది రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించింది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు దీపావళి కానుక అందించింది.

ఉప ఎన్నికల ఫలితాలే….

గత కొన్ని రోజులుగా పెట్రోలు ఉత్పత్తుల ధరలను చమురు సంస్థలు పెంచుతూ పోతున్నాయి. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు నిన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఆలోచింప చేసింది. దీంతోనే ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న నిర్ణయాన్ని తీసుకుంది.

Tags:    

Similar News