ఏపీ "స్పెషల్ స్టేటస్" బతికే ఉంది... కేంద్ర హోంశాఖ అజెండాలో?

కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సిద్దమయింది.

Update: 2022-02-12 06:17 GMT

కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సిద్దమయింది. ఈనెల 17వ తేదీన సమావేశానికి రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రహోంశాఖ లేఖ రాసింది. అజెండాను పంపింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ పంపిన అజెండాలో ప్రత్యేక హోదా అంశం ఇంకా కన్పించడమే. ప్రత్యేక హోదాపై ఈ సమావేశంలో చర్చించేందుకు నిర్ణయించడం ఏపీకి ఊరట కలిగించే అంశమే.

ఈనెల 17న...
ఇప్పటికే కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీతో త్రిసభ్య కమిటీని నియమించిన కేంద్ర హోంశాఖ ఈ నెల 17వ తేదీన చర్చించాల్సిన అంశాలపై అజెండాను రూపొందించింది. సుదీర్ఘకాలం తర్వాత కేంద్రం విభజన సమస్యల పరిష్కారానికి పూనుకుందనే చెప్పాలి. ఏడేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి త్రిసభ్ కమిటీ ద్వారా విభజన సమస్యలను పరిష్కరించాలని భావిస్తుంది. ప్రత్యేక హోదా అంశం కూడా అజెండాలో ఉంది కాబట్టి ఇంకా హోదా బతికి ఉన్నట్లేనని అనుకోవాలి.

అజెండా ఇదే....

1. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
2. ఏపీ, తెలంగాణల మధ్య విద్యుత్తు విభజన
3. రెండు రాష్ట్రాల మధ్య పన్ను బకాయీలు
4. రెండు రాష్ట్రాల మధ్య బ్యాంకు డిపాజిట్ల చెల్లింపులు
5. విద్యుత్తు సంస్థల వివాదం
6. వెనకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్
7. రీసోర్స్ గ్యాప్ పై చర్చ
8. ప్రత్యేక హోదా
9. పన్ను ప్రోత్సాహకాలు

Tags:    

Similar News