లాక్ డౌన్ లో కేంద్రం మరో వెసులుబాటు
కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు సామాన్య ప్రజలను చేరవేసేందుకు శ్రామిక్, ప్రత్యేక రైళ్లను [more]
కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు సామాన్య ప్రజలను చేరవేసేందుకు శ్రామిక్, ప్రత్యేక రైళ్లను [more]
కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు సామాన్య ప్రజలను చేరవేసేందుకు శ్రామిక్, ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే రైల్వే స్టేషన్లలో దిగిన ప్రయాణికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో రైల్వే స్టేషన్ల నుంచి బస్సులన ఏర్పాటు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పరిమిత సంఖ్యలో, భౌతిక దూరం పాటించేలా బస్సులు నడపాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఇక రైల్వే స్టేషన్ నుంచి బస్సులు నడిపే వెసులుబాటు రాష్ట్రాలకు లభించింది.