అట్టర్ ఫెయిల్యూర్.. వారిపై వేటు ఖాయమా?
ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన చలో విజయవాడ సక్సెస్ అయింది. ఎవరు అవునన్నా కాదన్నా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కన్పిస్తుంది.
ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయింది. ఎవరు అవునన్నా కాదన్నా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కన్పిస్తుంది. పోలీసుల్లో కూడా పీఆర్సీ చిచ్చు రేగడంతోనే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందన్న వాదన విన్పిస్తుంది. ఉద్యోగులకు పోలీసులు పూర్తిగా సహకరించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులు విజయవాడ ఎలా చేరుకున్నారన్న దానిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా మొదలు పెట్టారని తెలిసింది.
అనుమతి లేదని చెప్పినా...?
విజయవాడ పోలీసు కమిషనర్ క్రాంతి రాణా చలో విజయవాడకు అనుమతి లేదని చెప్పారు. విజయవాడకు నలువైపుల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా నిన్నటి నుంచే తనిఖీలు చేశారు. పీఆర్సీ సాధన సమితి సభ్యులు క్రాంతి రాణాను కలిసి సహకరించాల్సిందిగా కోరినా ఆయన అంగీకరించలేదు. బెజవాడలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావడానికి ఉన్నతాధికారుల సహకారం కూడా ఉందని చెప్పారు.
సెలవులు రద్దు చేసినా?
ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు రద్దు చేసినా ఇంత మంది ఉద్యోగులు ఎలా హాజరయ్యారన్న దానిపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్లు తెలిసింది. అయితే విజయవాడలో ఉద్యోగులో పాటు కొన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులకు కిందిస్థాయి ఉద్యోగులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ఫెయిల్యూర్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక పోలీసు ఉన్నతాధికారిపై వేటు పడటం ఖాయమని చెబుతున్నారు.
విధులను వదిలి....
విధులను వదిలిపెట్టి విజయవాడకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు తరలి రావడంపై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తీసుకుంది. మొత్తం మీద బెజవాడ సంఘటన కొందరు ఉన్నతాధికారులపై వేటు పడే అవకాశముందన్న టాక్ అధికార వర్గాల్లో నడుస్తుంది. ఆ అధికారులు ఎవరన్నది రెండు, మూడు రోజుల్లో తేలనుంది.