ఈసీని క‌లిసి చంద్ర‌బాబు, విప‌క్ష నేత‌లు

ఇవాళ ఉద‌యం సుప్రీం కోర్టులో వీవీప్యాట్ల స్లిప్పుల‌ను లెక్కించాల్సిందిగా వేసిన పిటీష‌న్ ను కోర్టు తిర‌స్క‌రించ‌డంతో విప‌క్ష నేత‌లు రూట్ మార్చారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌హా [more]

Update: 2019-05-07 11:56 GMT

ఇవాళ ఉద‌యం సుప్రీం కోర్టులో వీవీప్యాట్ల స్లిప్పుల‌ను లెక్కించాల్సిందిగా వేసిన పిటీష‌న్ ను కోర్టు తిర‌స్క‌రించ‌డంతో విప‌క్ష నేత‌లు రూట్ మార్చారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌హా విప‌క్ష .పార్టీల నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం చీఫ్ సునీల్ అరోరాను క‌లిశారు. 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపు కుద‌ర‌ద‌ని ఈసీ, సుప్రీం కోర్టు తేల్చినందున క‌నీసం 25 శాత‌మైన లెక్కించాల‌ని వారు ఈసీకి విజ్ఞ‌ప్తి చేశారు. వీవీ ప్యాట్ల స్పిప్పులు, ఈవీఎంల‌లో ఓట్ల తేడా వ‌స్తే మొత్తం నియోజ‌క‌వ‌ర్గంలో వీవీప్యాట్ల లెక్కింపు చేప‌ట్టాల‌ని వారు ఈసీని కోరారు. ఈవీఎంల‌పై త‌మ‌కు అనుమానాలు ఉన్నాయ‌ని, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త వ‌చ్చే వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని చంద్రాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News