తమ్ముళ్లూ.. అధైర్యపడవద్దు..నేనున్నా..!

మూడున్నర దశాబ్దాలుగా కార్యకర్తలకు తాను అండగా ఉన్నానని, మళ్లీ అండగా ఉంటానని.. ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సూచించారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో [more]

Update: 2019-05-28 06:10 GMT

మూడున్నర దశాబ్దాలుగా కార్యకర్తలకు తాను అండగా ఉన్నానని, మళ్లీ అండగా ఉంటానని.. ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సూచించారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్నికల కౌంటింగ్ రోజు తర్వాత మొదటి సారి ఓటమిపై స్పందించారు. ఓటమిపై సమీక్ష చేస్తూ అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, అన్నీ పరిగణలోకి తీసుకొని మార్పులు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోతామని అన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర తాము పోషిస్తామన్నారు. తమకు కూడా సుమారు 40 శాతం ఓట్లు వేశారని, వారికి అండగా ఉండాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని నడిపి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశామని, అయినా ఓడిపోయినందుకు చాలామంది బాధపడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ కు అపజయాలు వచ్చినప్పుడు మనోనిబ్బరాన్ని కోల్పోలేదన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకుపోవాలన్నారు.

Tags:    

Similar News