దేశాన్ని ఎక్కడకు తీసుకెళుతున్నారు.. బాబు సూటి ప్రశ్న

ఎన్నికల సంఘం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అధికారుల బదిలీలను నిరసిస్తూ ఆయన [more]

Update: 2019-04-10 08:41 GMT

ఎన్నికల సంఘం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అధికారుల బదిలీలను నిరసిస్తూ ఆయన బుధవారం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆరోపించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా 22 పార్టీలు బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరపాలని కోరినా ఈసీ స్పందించలేదన్నారు. వైసీపీ వాళ్లు ఏడు లక్షల ఓట్లు తొలగించినా ఈసీ స్పందించలేదన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే శ్రీకాకుళం కలెక్టర్ ను బదిలీ చేశారని అన్నారు. ఏకపక్షంగా ఇంటిలిజెన్స్ డ్యూటీని బదిలీ చేశారన్నారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు

ఏకంగా సీఎస్ ను సైతం బదిలీ చేశారని ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందన్నారు. టీడీపీ నేతలనే లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వైసీపీ వారి జేబు సంస్థగా మారిందన్నారు. వైసీపీ నేతలు చెప్పగానే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే, ఖూనీ చేస్తుంటే తాము చూస్తూ కూర్చొమన్నారు. దేశాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారని ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలన్నారు.

Tags:    

Similar News