పంచాయతీ ఎన్నికలకూ బాబు మ్యానిఫేస్టో
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మ్యానిఫేస్టో ను విడుదల చేశారు. వైసీపీ పాలనలో పూర్తిగా విఫలమయిందన్నారు. పల్లె ప్రగతి – పంచసత్రాల పేరుతో [more]
;
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మ్యానిఫేస్టో ను విడుదల చేశారు. వైసీపీ పాలనలో పూర్తిగా విఫలమయిందన్నారు. పల్లె ప్రగతి – పంచసత్రాల పేరుతో [more]
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మ్యానిఫేస్టో ను విడుదల చేశారు. వైసీపీ పాలనలో పూర్తిగా విఫలమయిందన్నారు. పల్లె ప్రగతి – పంచసత్రాల పేరుతో మ్యానిఫేస్టోను చంద్రబాబు విడుదల చేశారు. గ్రామాల్లో నాయకత్వం మరింత పటిష్టపడాలని కోరారు. తాము మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో ఉచిత రక్షిత నీరును అందిస్తామని చెప్పారు. గ్రామాల్లో భద్రత, ప్రశాంతతకు భరోసా కల్పిస్తామని చెప్పారు. ఆలయాలపై దాడులను అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం పెట్టనున్న మీటర్లను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్తిపన్ను తగ్గించి పౌర సేవలను మెరుగుపరుస్తామని చంద్రబాబు తన మ్యానిఫేస్టోలో పేర్కొన్నారు.