Chandrababu : ఏపీకి కేంద్ర బలగాలను పంపండి…గవర్నర్ కు బాబు?

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగడంతో గవర్నర్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. వెంటనే కేంద్ర బలగాలను ఏపీకి పంపాలని చంద్రబాబు గవర్నర్ ను [more]

Update: 2021-10-19 12:54 GMT

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగడంతో గవర్నర్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. వెంటనే కేంద్ర బలగాలను ఏపీకి పంపాలని చంద్రబాబు గవర్నర్ ను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తమ కార్యాలయాలపై దాడులకు దిగి బీభత్సం సృష్టించిందని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫర్నీచర్ తో పాటు వాహనాలను కూడా ధ్వంసం చేశారని, చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారని చంద్రబాబు గవర్నర్ కు తెలిపారు. ఏపీ పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని వెంటనే కేంద్ర బలగాలు రాష్ట్రానికి రప్పించి తమ కార్యాలయాలకు, నేతలకు రక్షణ కల్పించాలని కోరారు.

పట్టాభి కామెంట్స్ కారణంగానే…

పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వైఎస్ జగన్, పార్టీ నేతలపై చేసిన కామెంట్స్ కారణంగానే ఈ దాడులు జరిగాయి. అసభ్య పదజాలంతో పట్టాభి జగన్ ను దూషించారు. అందువల్లనే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారంటున్నారు పోలీసులు. రాష్ట్ర వాప్తంగా జిల్లా కేంద్రాలలోని అన్ని పార్టీ కార్యాలయాలపై వైసీీపీ కార్యకర్తలు దాడులు చేశారు. దీనిపై చంద్రబాబు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News