Chandrababu : ఉండవల్లి నివాసంలోనే చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసంలోనే ఉన్నారు. రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునివ్వడంతో పోలీసులు ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు [more]

Update: 2021-10-20 04:29 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసంలోనే ఉన్నారు. రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునివ్వడంతో పోలీసులు ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచే రాష్ట్రంలో జిల్లాల వారీగా బంద్ పరిస్థితిపై చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు వెంట నారా లోకేష్ కూడా ఉన్నారు.

ఎక్కడికక్కడ అరెస్ట్ లు…

వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసినందుకు నిరసనగా బంద్ కు పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు ఈరోజు తెల్లవారు జామునుంచే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తు అరెస్ట్ లు చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News