Chandrababu : దీక్షలో చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ కు కేరాఫ్ గా ప్రభుత్వం తయారు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతుందన్నారు. మొన్న [more]
ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ కు కేరాఫ్ గా ప్రభుత్వం తయారు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతుందన్నారు. మొన్న [more]
ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ కు కేరాఫ్ గా ప్రభుత్వం తయారు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతుందన్నారు. మొన్న జరిగింది టీడీపీ జరిగింది కాదని, ప్రజలపై జరిగిన దాడి అని చంద్రబాబు అన్నారు. దాడి వెనక పెద్ద కుట్ర జరిగిందన్నారను. దాడులు తమపై చేసి పట్టాభి ని అరెస్ట్ చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పట్టాభి వ్యాఖ్యలను తప్పు పడితే అంతకు ముందు సీఎం, మంత్రుల వాడిన భాషపై చర్చకు సిద్దమా అని చంద్రబాబు నిలదీశారు.
ఫిర్యాదు చేసిన వారిపై కేసులా?
మొన్న జరిగిన దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని చంద్రబాబు అన్నారు. ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు నమోదు చేయడమేంటని అన్నారు. డీజీపీకి సిగ్గులేదా? అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీడీపీని అంతమొందించాలనే కుట్ర జరుగుతుందని చంద్రబాబు అన్నారు. సమస్యలపై తాము అనేక విధాలుగా పోరాటం చేస్తామని, దాడులకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని నిర్ణయించామన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ఇంతవరకూ నా మంచితనమే చూశారని, ఇకపై రెండో కోణం చూస్తారని చంద్రబాబు హెచ్చరించారు.