Chandrababu : బాబు ఢిల్లీ టూర్ వాయిదా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నిజానికి రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. హోంశాఖ [more]

Update: 2021-10-22 14:59 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నిజానికి రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. కానీ ఇంతవరకూ లభించలేదు. అమిత్ షా రేపు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళుతున్నారు. మూడురోజుల పాటు అమిత్ షా అక్కడే ఉంటారు. తాజాగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అపాయింట్ మెంట్ దొరికింది. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ను కూడా కోరారు. ఆయన అపాయింట్ మెంట్ ఖరారు కావాల్సి ఉంది.

Tags:    

Similar News