Chandrababu : పరిస్థితులు ఏం బాగాలేవు… రాష్ట్రపతి పాలన పెట్టండి

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది కొద్ది సేపటి క్రితం చంద్రబాబు రాష్ట్రపతితో [more]

Update: 2021-10-25 07:46 GMT

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది కొద్ది సేపటి క్రితం చంద్రబాబు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎనిమిది పేజీల లేఖను రాష్ట్రపతికి ఇచ్చారు. ఏపీలో మాదక ద్రవ్యాల నెట్ వర్క్ పై విచారణ చేయాలని కోరారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు.

వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టండి…

తక్షణం 356 అధికరణం కింద ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు. ఏజెన్సీ ఏరియాల్లో ఎనిమిది వేల కోట్ల గంజాయిని పెంచుతున్నారన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ వైపు చూపిస్తున్నారన్నారు. ముంద్రా పోర్టులో పట్టుకున్న 21 వేల కోట్లరూపాయల హెరాయిన్ కూడా ఏపీ అడ్రస్ ఉందని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News