అది నా చిర‌కాల కోరిక‌

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన క‌రువును పార‌ద్రోలాల‌నేది త‌న చిర‌కాల కోరిక అని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించి [more]

Update: 2019-05-06 07:50 GMT

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన క‌రువును పార‌ద్రోలాల‌నేది త‌న చిర‌కాల కోరిక అని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించి ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… దేశంలోనే రికార్డు స్పీడ్ తో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత పోల‌వ‌రం ప‌నుల్లో కొంచెం స్పీడ్ త‌గ్గింద‌ని పేర్కొన్నారు. ఈ సంవ‌త్స‌రం గ్రామిటీ ద్వారా నీళ్లు ఇవ్వ‌డం కుద‌ర‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టికే 70 శాతం పోల‌వ‌రం ప‌నులు పూర్త‌య్యాయ‌ని తెలిపారు. వ‌చ్చే సంవ‌త్స‌రం జూన్ లోగా 100 శాతం పోల‌వ‌రం ప‌నులు పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News