ఈవీఎంలు వద్దంటే వినడం లేదు: చంద్రబాబు
అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీ ఎక్కువగా ఉన్న దేశాలు కూడా ఈవీఎంలను వాడటం లేదని, మన వద్ద ఈవీఎంల ద్వారా ఓటింగ్ ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు [more]
అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీ ఎక్కువగా ఉన్న దేశాలు కూడా ఈవీఎంలను వాడటం లేదని, మన వద్ద ఈవీఎంల ద్వారా ఓటింగ్ ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు [more]
అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీ ఎక్కువగా ఉన్న దేశాలు కూడా ఈవీఎంలను వాడటం లేదని, మన వద్ద ఈవీఎంల ద్వారా ఓటింగ్ ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేపర్ మీద ఓటు వేసిన సంతృప్తి ఈవీఎంలలో వేస్తే రాదన్నారు. ఈవీఎంల ద్వారా సాంకేతిక సమస్యలతో పాటు మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందన్నారు. అందుకే ఈవీఎంలు వద్దని తాను ముందునుంచీ ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. ఇవాళ కూడా ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరిగేలా సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తామన్నారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.