బ్రేకింగ్: సచివాలయం ముందు చంద్రబాబు ధర్నా

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తూ సచివాలయం ముందు ఆయన ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘం [more]

Update: 2019-04-10 08:56 GMT

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తూ సచివాలయం ముందు ఆయన ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆయన ధర్నా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘంలో మార్పువచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఆరోపణలపై పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనిని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ ఫిర్యాదు చేస్తే అధికారులపై ఎలా చర్యలు తీసుకుంటారని, కనీసం కారణాలు కూడా చూపకుండా ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News