రెండు గంటల పాటు భేటీ.. జీవో నెంబరు వన్ పై చర్చించాం
ఏపీ అభివృద్ధిని పట్టాలు ఎక్కించే బాధ్యతను అందరం కలసి తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. పవన్, చంద్రబాబు భేటీ ముగిసింది
ఏపీ అభివృద్ధిని పట్టాలు ఎక్కించే బాధ్యతను అందరం కలసి తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. పవన్, చంద్రబాబు భేటీ ముగిసింది. ఆ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. రోడ్ల వెడల్పు పేరుత ఇళ్లను కూల్చి వేశారన్నారు. ఈ రోజు కేవలం జీవో నెంబరు 1 మాత్రమే చర్చించామని తెలిపారు. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నంలో భాగంగానే జీవో నెంబరు వన్ తెచ్చారన్నారు. దానిని న్యాయపరంగానూ, ప్రజాస్వామ్యయుతంగానూ ఎదుర్కొంటానని తెలిపారు. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. తన కుప్పం పర్యటనలో రెండు వేల మంది పోలీసులను పెట్టి గొడవ చేశారన్నారు. తమ వ్యూహాల ప్రకారం ముందుకు వెళతామన్నారు. ప్రజాపోరాటం మాత్రమే కాదు న్యాయపోరాటం కూడా చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో చాలా పొత్తులు పెట్టుకుంటామన్నారు. ప్రభుత్వం వారి జాగీరు కాదన్నారు. రాష్ట్రాన్ని పరిరక్షించాల్సిన అవసరం గవర్నర్ కు ఉందని అన్నారు.