ఆ… నేత‌ల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై అధినేత చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ అయ్యారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లో భాగంగా ఇవాళ అమ‌రావ‌తిలో శ్రీకాకుళం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష జ‌రిగింది. [more]

Update: 2019-05-10 11:48 GMT

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై అధినేత చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ అయ్యారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లో భాగంగా ఇవాళ అమ‌రావ‌తిలో శ్రీకాకుళం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష జ‌రిగింది. అయితే, బంధువు మ‌ర‌ణంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా ల‌క్ష్మీదేవి ఈ స‌మీక్ష‌కు హాజ‌రుకాలేదు. ఆమెతో పాటు శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు సైతం స‌మీక్ష‌కు రాలేదు. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. స‌మీక్ష స‌మావేశం ఉంద‌ని తెలిసినా నిర్ల‌క్ష్యంతో హాజ‌రుకాకపోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న వారికి గ‌ట్టి గానే చెప్పిన‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News