తెలంగాణలో స్థిరపడిన వారు ఆంధ్రులైనా వారు తెలంగాణ బిడ్డలేనని కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.ఆంధ్ర, రాయలసీమ వాసులు హైదరాబాదీలేనని ఆయన తెలిపారు.కుళ్లు,కుతంత్రాలతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా 17 పేజీల మేనిఫేస్టోను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి తన మేనిఫేస్టోను విడుదల చేసింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ్యానిఫేస్టో విడుదల చేశారు.
పాత పథకాలన్నింటినీ......
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 3,016లు ఇస్తామని ప్రకటించారు. వృద్ధాప్య పింఛను వయస్సును పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్టీ, మైనారిటీ లకు 12 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో పోరాడతామన్నారు. ఉద్యోగనియామకాల పరిమితి మూడేళ్లకు పెంచుతున్నామన్నారు. సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారికి పట్టాలు ఇస్తామన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. వృద్ధాప్యపింఛన్ల అర్హుల వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తున్నామన్నారు. పాత పథకాలన్నింటిని కొనసాగిస్తామని చెప్పారు.