చంద్రయాన్‌ -3 ల్యాండింగ్‌ తేదీ మార్చనున్నారా?

ఇప్పుడు దేశ వ్యాప్తంగా చంద్రయాన్‌ 3 గురించే మాట్లాడుకుంటున్నారు. ఆగస్టు 23వ తేదీన జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ..

Update: 2023-08-22 03:35 GMT

ఇప్పుడు దేశ వ్యాప్తంగా చంద్రయాన్‌ 3 గురించే మాట్లాడుకుంటున్నారు. ఆగస్టు 23వ తేదీన జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయనున్నారు శాస్త్రవేత్తలు. సురక్షితంగా ల్యాండింగ్‌ కావాలంటే ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే చంద్రయాన్ 3 చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. కానీ ఇప్పుడు ఇస్త్రో శాస్త్రవేత్తలు ఓ సమస్య వచ్చి పడింది. దక్షిణ ధృవంపై ల్యాండింగ్‌ చేసేందుకు సరైన స్థలం లభించకపోవడంతో ల్యాండింగ్‌ తేదీ మార్చే అవకాశం రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇస్రో ప్రకారం.. చంద్రయాన్-3 ఆగస్టు 23, 2023న సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు చంద్రునిపై చంద్రయాన్‌ -3ని ల్యాండ్ చేయడానికి చదునైన ఉపరితలం కనుగొనడం చాలా కష్టంగా మారిందని, దీని వల్ల ల్యాండింగ్‌ తేదీ మారే అవకాశం కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.ఇప్పటికే ల్యాండర్‌ మాడ్యూల్‌కు జోడించిన కెమెరా ద్వారా కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది. ఈ దృశ్యాల ద్వారా ఇస్రో అధికారులు చదునైన ఉపరితలం కోసం చూస్తున్నారు.

కానీ అలాంటి భాగమేదీ ఇంతవరకు గుర్తించబడలేదని తెలుస్తోంది. అందుకే చంద్రయాన్ 3 చంద్రుడిపై దిగడానికి ఇంకా కొన్ని రోజులు పట్టవట్టవచ్చని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ మేనేజర్ నీలేష్ చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ గురించి మాట్లాడారు. చంద్రయాన్‌-3 తేదీని మార్చుకోవచ్చని తెలిపారు. చంద్రయాన్‌ 3ని చంద్రుడిపై ల్యాండింగ్ చేయడానికి రెండు గంటల ముందు ల్యాండర్, చంద్రుని పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందని, అక్కడి పరిస్థితులను బట్టి సరైన ఉపరితలం లభిస్తే ల్యాండింగ్‌కు అవకాశం లభిస్తుందని, లేకుంటే తేదీ మార్చే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ల్యాండింగ్‌ కోసం ఆగస్టు 27వ తేదీ వరకు పొడిగించే అవకాశం రావచ్చంటున్నారు. అయితే చివరి క్షణంలో పరిస్థితులను బట్టి తేదీ మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌కు సంబంధించి ఇస్త్రో లైవ్‌ టెలికాస్ట్‌ చేయనుంది. దేశ ప్రజలు వీక్షించేందుకు ఇస్త్రో అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లైవ్‌ ఇవ్వనుంది.



Tags:    

Similar News