సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు.. ఆచట్టం…?

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124 ఎ చట్టంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇంకా [more]

Update: 2021-07-15 07:04 GMT

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124 ఎ చట్టంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇంకా దేశ ద్రోహం చట్టం అవసరమా అని జస్టిస్ ఎన్వీ రమణ అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఇది బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలసచట్టమని ఎన్వీ రమణ అభిప్రాయ పడ్డారు. సమరయోధులకు వ్యతిరేకంగా దేశద్రోహం చట్టం తెచ్చారన్నారు. సెక్షన్ 124 ఎపై దాఖలైన అన్ని కేసులనూ ఒకేసారి విచారిస్తామని జస్టిస్ ఎన్వీరమణ తెలిపారు. పేకాట ఆడేవారిపైనా దేశద్రోహం చట్టం కింద కేసులు పెడుతున్నారని, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News