సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కోర్టు హాలులోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డుకవర్ లో ఇచ్చిన నివేదికను ఒక పత్రికలో ఎలా వచ్చిందని ఇరు పక్షాల న్యాయవాదులను ప్రశ్నించారు. లీకులతోనే న్యాయవాదులు కాలక్షేపం చేస్తుందని ఎద్దేవా చేశారు. విచారణ అంశాలను ఎలా లీక్ చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో నేడు విచారణ చేపట్టాల్సిన కేసును ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా విచారణ ఎందుకని చీఫ్ జస్టిస్ సీరియస్ గా ప్రశ్నించారు. వైర్ అనే పత్రికలో సీల్డ్ కవర్ లో ఉన్న సారాంశం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసును విచారిస్తున్న సందర్భంగా రంజన్ గొగొయ్ ఈ విధంగా స్పందించారు.