ఇదేం తరలింపు… నిలదీసినా పట్టించుకోరా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే తరలించడం సరికాదన్నారు. ముంపు ప్రాంతాల్లో గిరిజనులను ప్రభుత్వం [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే తరలించడం సరికాదన్నారు. ముంపు ప్రాంతాల్లో గిరిజనులను ప్రభుత్వం బలవంతంగా తరలించడం పట్ల చినరాజప్ప అభ్యంతరం వ్యక్తం చేశారు. పునరావాస కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతనే వారిని తరలించాలని కోరారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ నిలదీసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస కార్యక్రమాలను అమలు చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.