బ్రేకింగ్ : చింతమనేని అరెస్ట్ కు రెడీ

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశముంది. గత పదిరోజులుగా చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ [more]

Update: 2019-09-11 03:51 GMT

టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశముంది. గత పదిరోజులుగా చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. చింతమనేని కోసం పన్నెండు ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. అయితే చింతమనేని ప్రభాకర్ సతీమణి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన తన ఇంటికి వస్తారన్న సమాచారం అందుకున్న పోలీసులు దుగ్గిరాలకు చేరుకున్నారు. అయితే టీడీపీ నేతలు దీనిని తప్పుపడుతున్నారు. తన భార్య అనారోగ్యంతో ఉంటే చూసేందుకు వస్తున్న చింతమనేని ఇంట్లో పోలీసులు ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు

Tags:    

Similar News