ఆ ఎన్నికల్లో చిరంజీవి ఎటు వైపు..?
ఈసారి మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న సీనియర్ హీరో నరేష్ తన ప్యానెల్ బరిలో దిగడంతో శివాజీ రాజాకు [more]
ఈసారి మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న సీనియర్ హీరో నరేష్ తన ప్యానెల్ బరిలో దిగడంతో శివాజీ రాజాకు [more]
ఈసారి మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న సీనియర్ హీరో నరేష్ తన ప్యానెల్ బరిలో దిగడంతో శివాజీ రాజాకు పోటీ తప్పలేదు. శివాజీ ఏకగ్రీవం అవుతుందనుకున్న పోరు కాస్తా రెండు వర్గాల మధ్య పోరాటంగా మారింది. ఇప్పుడు ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు మారారు. దాదాపు 800 మంది సభ్యులున్న మా ఎన్నికల్లో గెలుపు ఏ వర్గాన్ని వరిస్తుందా? అన్న ఆసక్తికర చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది.
చిరంజీవి ఎటు ఉంటారు..?
ఇప్పటికే నరేష్ కు కృష్ణతో పాటు మహేష్ బాబు సపోర్ట్ కూడా ఉంది. ఇంకా లేటెస్ట్ గా నరేష్ ప్యానెల్ మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఉత్కంఠ పెంచుతోంది. జీవిత – రాజశేఖర్ లతో నరేష్ చిరంజీవిని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ అందుకున్నారు. గత రెండు దఫాలుగా శివాజీ రాజాకే మద్ధతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి ఓటు ఈ సారి ఎటువైపు పడనుంది? చిరంజీవి ఎటు సపోర్ట్ చేస్తే ఆ వర్గమే గెలుస్తుంది. కాబట్టి చిరు ఈ సారి ఎవరికి ఓట్ వేస్తాడో చూడాలి. మార్చి 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి.