వ్యాపారవేత్త ఇరుక్కున్నారా?

హీరో రాజ్ తరుణ్ కు ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి రాజ్ తరుణ్ తృటిలో తప్పించుకున్నాడు. యాక్సిడెంట్ తరువాత పరుగులు పెడుతున్న సీసీ పుటేజీ నిన్న నెట్టింట్లో [more]

Update: 2019-08-21 13:03 GMT

హీరో రాజ్ తరుణ్ కు ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి రాజ్ తరుణ్ తృటిలో తప్పించుకున్నాడు. యాక్సిడెంట్ తరువాత పరుగులు పెడుతున్న సీసీ పుటేజీ నిన్న నెట్టింట్లో హల్ చల్ చేసింది. అంతేగాకుండా ఈ ప్రమాదంపైన రకరకాల ఉహాగానాలు బయటకు వచ్చాయి. వీటన్నింటిని పోలీసులు పరిగణలోకి తీసుకుని నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సుమోటోగా కేసును నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ నడిపిన కారు యాజమానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కారు ప్రమాదం ఎలా జరిగింది. ఎంతమంది కారులో వున్నారు. కారులో వున్న వ్యక్తి ప్రమాదం తరువాత ఎందుకు పరుగులు పెట్టారు. ఇలాంటి వాటికి సమాధానం ఇవ్వాలని పోలీసులు కారు యాజమాని ప్రదీప్ కు నోటీసులు ఇచ్చారు. ఇవన్ని ఒక వైపు జరుగుతుంటే రాజ్ తరుణ్ ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో చాల విషయాలను తెలిపారు. 49 సెకన్లు వీడియోలో తాను సీట్ బెల్డు పెట్టుకొవడంతోనే ఈ ప్రమాదం నుంచి బయట పడ్డానని తెలిపారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ఓ నిర్మాత కారులో ఇంటికి బయలుదేరిన రాజ్ తరుణ్ .. అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ వద్ద అదుపుతప్పి గోడను ఢీకొన్నారు. ప్రమాదం జరిగిన తరువాత సంఘటనా స్థలం నుంచి రాజ్ తరుణ్ పరుగులు తీశారు.

ట్వీట్.. వీడియోలతో….

ఈ నేపథ్యంలో రాజ్‌ తరుణ్ ప్రమాదం జరిగిన తర్వాత మొదటి ట్వీట్‌ చేశారు. సీటు బెల్టు తనను కాపాడిందని ఓ పోస్ట్‌ చేశారు. ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ‘నాపై చూపిన అభిమానానికి అందరికీ ధన్యవాదాలు. నేను క్షేమంగా ఉన్నానా? లేదా? అని తెలుసుకోవడానికి చాలా మంది ఫోన్లు చేశారు. నార్సింగ్ సర్కిల్‌ నుంచి ఇంటికి చేరుకున్నానని రాజ్ తరుణ్ తెలిపాడు. గత మూడు నెలల్లో అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ వద్ద చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా కుడివైపుకు తిరగాల్సి వచ్చింది. కుడివైపు స్టీరింగ్‌ తిప్పాలని నిర్ణయించుకునేలోపు.. అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు పక్కనున్న గోడను ఢీకొంది. భయంతో ఆ క్షణం నాకు ఏం చేయాలో అర్థంకాలేదు. సీటు బెల్టు తీసి.. నన్ను నేను చూసుకున్నా. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లానని చెప్పాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. మరికొన్ని రోజుల్లో షూటింగ్‌లో పాల్గొంటాను. మీ ప్రేమకు మరోసారి థాంక్స్‌ అని రాజ్ వీడియాలో పొస్టింగ్ చేశారు..ఏది ఏమైనా రాజ్ తరుణ్ ప్రమాదం ఇప్పడు ఒక వ్యాపార వేత్త మెడకు చుట్టుకుంది.

Tags:    

Similar News