గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం జగన్

గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. మున్ముందు రాష్ట్రానికి మరిన్ని స్పైసెస్..

Update: 2022-11-11 05:53 GMT

cm jagan inaugurates global spice unit

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా లోని వంకాయలపాడులో రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఏటా 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందన్నారు. ఈ యూనిట్ వల్ల 14 వేలమంది రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. మున్ముందు రాష్ట్రానికి మరిన్ని స్పైసెస్ కంపెనీలు రావాలని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్త 33 వేల ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ మొదటిస్థానంలో ఉందన్నారు. అనంతరం సీఎం జగన్ గుంటూరు జిల్లా వైద్యకళాశాలకు వెళ్లి.. అక్కడ ప్లాటినం జూబ్లీ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు.


Tags:    

Similar News