పాలన వికేంద్రీకరణ చేసి తీరతాం : సీఎం జగన్

పాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు చేస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ

Update: 2022-04-04 07:02 GMT

తాడేపల్లి : ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 26 జిల్లాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ 13 కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఆవిష్కరించారు. అనంతరం కొత్త జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో పాలన వికేంద్రీకరణ చేసి తీరుతామని తెలిపారు.

పాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు చేస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో కొన్నింటిని మార్పులు చేశామని, ప్రజల విన్నపాల మేరకు ఈ మార్పులు చేసినట్లు వివరించారు. అలాగే కుప్పం ఎమ్మెల్యే (చంద్రబాబు) విజ్ఞప్తి మేరకు కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పటికీ కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయారని ఈ సందర్భంగా సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేయలేని పనిని తాము చేసి చూపించామన్నారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో కొత్త కార్యాలయాల ద్వారానే సేవలు కొనసాగుతాయని, ఉద్యోగులు కొత్త కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తారని సీఎం పేర్కొన్నారు.


Tags:    

Similar News