సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
5 నెలల క్రితమే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇప్పటి వరకూ వారి సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే ..
సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రభుత్వ సెలవులు లేని వారికి.. ఇకపై అన్ని ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులిచ్చింది. పురపాలిక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగుల సెలవులపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు.
కాగా.. 5 నెలల క్రితమే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇప్పటి వరకూ వారి సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే అమలవుతోంది. వారంతా తమకు కేటాయించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను మాత్రమే వినియోగించుకుంటున్నారు. సచివాలయ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సెలవులను వర్తింప జేయాలని కోరుతూ.. ఉద్యోగ సంఘాలు పులపాలిక శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్నిరకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.