రాబోయే రోజులు మరింత కీలకం
రాబోయే రోజులు తెలంగాణకు మరింత కీలకమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సెకండ్ వేవ్ ఉధృతి తెలంగాణలో తీవ్రంగా కన్పిస్తుందని చెప్పారు. పాజిటివ్ కేసుల శాతం [more]
రాబోయే రోజులు తెలంగాణకు మరింత కీలకమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సెకండ్ వేవ్ ఉధృతి తెలంగాణలో తీవ్రంగా కన్పిస్తుందని చెప్పారు. పాజిటివ్ కేసుల శాతం [more]
రాబోయే రోజులు తెలంగాణకు మరింత కీలకమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సెకండ్ వేవ్ ఉధృతి తెలంగాణలో తీవ్రంగా కన్పిస్తుందని చెప్పారు. పాజిటివ్ కేసుల శాతం గతంతో పోలిస్తే రెట్టింపయిందని శ్రీనివాసరావు తెలిపారు. డబుల్ మ్యూటెంట్ దీనికి కారణమని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారితో ఎక్కువ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. రాబోయే ఆరు వారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని శ్రీనివాసరావు సూచించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడంతోనే కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.