చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ సీఎస్, ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సీరియస్ అయ్యారు. ఇవాళ విశ్రాంత ఐఏఎస్ [more]

Update: 2019-04-16 08:24 GMT

ఆంధ్రప్రదేశ్ సీఎస్, ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సీరియస్ అయ్యారు. ఇవాళ విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, గోపాల్ రావు తదితరులు గవర్నర్ నరసింహన్ ను కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏపీ సీఎస్, సీఈఓపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. తన రాజకీయ లబ్ధి కోసం అధికారులపై దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకు తగదన్నారు. తాము ఆత్మప్రభోదం ప్రకారమే పనిచేశామని, చేస్తున్నామని పేర్కొన్నారు. తాము నిజాయితీగా పనిచేస్తుండటం వల్లే వ్యవస్థ సరిగ్గా ఉందన్నారు. తమ వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని వారు స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ సుబ్రమణ్యంను ఉద్దేశించి చంద్రబాబు కోవర్ట్ అని, నిందితుడు అని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News