తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల దిశగా ఆలోచనలు చేస్తుండటం, పార్టీ శ్రేణులను కూడా సిద్ధం చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడ అలెర్ట్ అయ్యింది. మంగళవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలని, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోనేందుకు ప్రణాళికలను రూపొందించాలని నిర్ణయించారు. ఎన్నికలకు శంఖారావంగా టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు కౌంటర్ గా ‘ప్రజల ఆవేదన సభ’ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది.