కాంగ్రెస్ బస్సు యాత్రకు వైసీపీ బ్రేక్

కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ బస్సుయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి వద్దకు చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు [more]

Update: 2019-02-23 10:08 GMT

కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ బస్సుయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి వద్దకు చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనకు దిగారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి కష్టాల్లోకి నెట్టేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తూ కాంగ్రెస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని విభజన చట్టంలో ఎందుకు చెప్పలేదని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనను పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఖండించారు. తమ యాత్రను అడ్డుకోవడానికి ఆనం రాంనారాయణరెడ్డి రౌడీలను పంపించారని, జగన్ ఒక రౌడీ పార్టీని స్థాపించారని ఆరోపించారు. పదేళ్లు కాంగ్రెస్ హయాంలో పందికొక్కుల్లా సంపాదించుకొని ఇప్పుడు తమ యాత్రనే అడ్డుకున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News