వోట్ ఆన్ అకౌంట్ కాదు… అకౌంట్ ఫర్ వోట్స్

కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఎన్నికల్లో ఓట్ల కోసమే రూపొందించారని, పథకాలు పూర్తిగా ఎన్నికల జిమ్మిక్స్ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ఇవాళ లోక్ సభలో [more]

Update: 2019-02-01 09:48 GMT

కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఎన్నికల్లో ఓట్ల కోసమే రూపొందించారని, పథకాలు పూర్తిగా ఎన్నికల జిమ్మిక్స్ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, బడ్జెట్ పై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ట్వీట్టర్ ద్వారా స్పందించారు. ఇది వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదని అకౌంట్ ఫర్ వోట్స్ బడ్జెట్ అని విమర్శించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. దేశవనరులపై పేదలకే మొదటి హక్కు ఉంటుందని కాంగ్రెస్ చెప్పిన నినాదాన్ని కాపీ చేసినందుకు ఆయన కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.

Tags:    

Similar News