గండం గడిచేటట్లుందిగా

మరి కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్షకు సిద్ధమవుతుండగా అసంతృప్త ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను [more]

Update: 2019-07-18 03:48 GMT

మరి కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్షకు సిద్ధమవుతుండగా అసంతృప్త ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని చెప్పారు. ఆయనతో పాటు మరో నలుగురు శాసనసభ్యులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. చివరి క్షణంలో పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు వస్తే కుమారస్వామి ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మరోవైపు జనతాదళ్ ఎస్ అసెంబ్లీ కి తప్పనిసరిగా హాజరుకావాంగండం గడిచేటట్లుందిగాటూ సభ్యులకు విప్ జారీ చేసింది.

Tags:    

Similar News