కారుతో 'కారు'పై దాడి
కాంగ్రెస్ వినూత్న ప్రచారం ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయం వేడెక్కుతోంది.
కాంగ్రెస్ వినూత్న ప్రచారం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కి గెలుపు మీద ఆశలు పెరగడంతో, ప్రచారంలో కూడా దూకుడు పెంచుతోంది. భారత రాష్ట్ర సమితి కారు గుర్తునే తన ప్రచారానికి అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. బై బై కేసీఆర్ అంటూ కారుపై బీఆర్ఎస్ ప్రభుత్వ 10 స్కాంల ప్రదర్శిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతోంది.
కారు నెంబర్ ప్లేట్ ని కూడా వినూత్నంగా డిజైన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కెసిఆర్ 420 పేరిట నెంబర్ ప్లేట్ ని కారుకు అమర్చి, ఆ కారును ప్రచారానికి వెడుతోంది. 'తెలంగాణ ముంచిండు, ఐదు లక్షల కోట్ల అప్పులు మోపిండు... 10 ఏళ్ల అహంకారం పై తిరగబడదాం వందేళ్ళ ఫంక్షన్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం' అంటూ కెసిఆర్ చిత్రపటాలతో గులాబీ రంగు కార్లను సిద్ధం చేసింది హస్తం పార్టీ.
ఈ ప్రచార ఆర్భాటానికి తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తమ్మీద ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి.