మాకు రూ.50 లక్షలు ఇస్తామన్నారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే రూ.50 లక్షలు ఇస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు ఆఫర్ ఇచ్చారని, డబ్బుకు అమ్ముడుపోయే వారిమైతే ఓటేసి కాంగ్రెస్ లోనే ఉండేవారిమని [more]
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే రూ.50 లక్షలు ఇస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు ఆఫర్ ఇచ్చారని, డబ్బుకు అమ్ముడుపోయే వారిమైతే ఓటేసి కాంగ్రెస్ లోనే ఉండేవారిమని [more]
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే రూ.50 లక్షలు ఇస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు ఆఫర్ ఇచ్చారని, డబ్బుకు అమ్ముడుపోయే వారిమైతే ఓటేసి కాంగ్రెస్ లోనే ఉండేవారిమని పార్టీకి రాజీనామా చేసిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ… ఆదివాసీల సమస్యలపై కేసీఆర్ ను కలిశాక ఆయన స్పందించిన తీరు చూసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడ్డామని అన్నారు. తమను కొనుగోలు చేశారని, తాము అమ్ముడుపోయామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. సరిపడా బలం లేకుండా ఎమ్మెల్యేగా అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్ ఎవరిని కొనాలనుకుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ ఎంతకు కొన్నదని అన్నారు. గతంలోనూ ఇతరు సామాజకవర్గాల వారు పార్టీ మారితే స్పందించని కాంగ్రెస్ నేతలు తాము ఆదివాసీల మైనందునే ఎక్కువ ఆరోపణలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీపై పోటీ చేస్తామని స్పష్టం చేశారు.