ఫ్రెండ్ బ‌ర్త్‌డేను పోలీస్ స్టేష‌న్ లో చేసిన ఫ్రెండ్లీ పోలీస్

ఫ్రెండ్లీ పోలిసింగ్ చేయాలంటున్న ఉన్న‌తాధికారుల మాట‌ల‌ను ఓ సీఐ చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు. ఏకంగా త‌న స్నేహితుడైన ఓ కాంట్రాక్ట‌ర్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను పోలిస్ [more]

Update: 2019-05-06 06:59 GMT

ఫ్రెండ్లీ పోలిసింగ్ చేయాలంటున్న ఉన్న‌తాధికారుల మాట‌ల‌ను ఓ సీఐ చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు. ఏకంగా త‌న స్నేహితుడైన ఓ కాంట్రాక్ట‌ర్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను పోలిస్ స్టేష‌న్ లోనే ఘ‌నంగా జ‌రిపించారు. వీణ‌వంక మండ‌లం గంగారం గ్రామానికి చెందిన న‌ల్లా వెంక‌ట్ రెడ్డి అనే కాంట్రాక్ట‌ర్ పుట్టిన రోజు ఈ నెల 4వ తేదీన జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌న స్నేహితుడైన మాన‌కొండ‌రు సీఐ ఇంద్ర‌సేనారెడ్డి ఏకంగా త‌న చాంబ‌ర్ లోనే వెంక‌ట్ రెడ్డితో కేక్ క‌ట్ చేయించి తినిపించారు. పోలీస్ సిబ్బందితో పాటు వారి స్నేహితులు కూడా ఈ కార్య్ర‌క‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఒక ప్రైవేటు వ్యక్తి పుట్టిన‌రోజును ఏకంగా పోలీస్ స్టేష‌న్ లోనే జ‌ర‌ప‌డంపై సీఐపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నారు.

Tags:    

Similar News