బ్రేకింగ్: రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు [more]

Update: 2019-04-30 06:26 GMT

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. 2003లో యూకేలో నమోదైన ఒక కంపెనీకి సంబంధించిన వివరాల్లో రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఇందకు సంబంధించిన ఆధారాలను సైతం సుబ్రహ్మణ్యస్వామి సమర్పించారు. దీంతో రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. బ్రిటన్ పౌరసత్వానికి సంబంధించి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్ ను హోంశాఖ ఆదేశించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే భయంతోనే బీజేపీ ఇటువంటి కుట్రలకు తెరలేపిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

Tags:    

Similar News