చివరి నిమిషం వరకూ.. ఉరికి రెండు గంటల ముందు వరకూ?

నిర్భయ కేసులో దోషులు చివరి నిమిషం వరకూ ఉరిశిక్ష వాయిదా పడేందుకు ప్రయత్నించారు. తెల్లవారుఝామున సుప్రీంకోర్టు నిందితుల పిటీషన్ ను కొట్టివేయడంతోనే ఉరిశిక్ష అమలు జరిగింది. తెల్లవారుజాము [more]

Update: 2020-03-20 03:38 GMT

నిర్భయ కేసులో దోషులు చివరి నిమిషం వరకూ ఉరిశిక్ష వాయిదా పడేందుకు ప్రయత్నించారు. తెల్లవారుఝామున సుప్రీంకోర్టు నిందితుల పిటీషన్ ను కొట్టివేయడంతోనే ఉరిశిక్ష అమలు జరిగింది. తెల్లవారుజాము వరకు హైడ్రామా నడిచింది. నిందితులు తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. ఈ తీర్పు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చింది. ఆ తర్వాత నిందితుల తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా స్టే విధించాలని కోరారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు వరకూ సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఇక్కడ కూడా కొట్టివేయడంతో 5.30 గంటలకు నలుగురు నిందితులను ఉరి తీశారు. ఉరిశిక్ష అమలు చేసే ముందు వినయ్ శర్మ బోరున విలపించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకే అల్పాహారం పెట్టిన తీహార్ జైలు అధికారులు ఉరికంబం వద్దకు ఐదు గంటలకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత తలారి పవన్ ఉరిశిక్షను అమలు చేశారు. నలుగురి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగిస్తారు.

Tags:    

Similar News