క్రమంగా పెరుగుతున్న భక్తులు… ఆదాయం
దేశ వ్యాప్తంగా కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది. దీంతో ఆలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ తిరుమలలోనూ భక్తుల సందడి పెద్దగా కన్పించలేదు. కోవిడ్ [more]
దేశ వ్యాప్తంగా కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది. దీంతో ఆలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ తిరుమలలోనూ భక్తుల సందడి పెద్దగా కన్పించలేదు. కోవిడ్ [more]
దేశ వ్యాప్తంగా కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది. దీంతో ఆలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ తిరుమలలోనూ భక్తుల సందడి పెద్దగా కన్పించలేదు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తుండటం, తక్కువ మందికే దర్శనం టిక్కెట్లు జారీ చేస్తున్నా భక్తులు కరోనాకు భయపడి తిరుమలకు రాలేదు. అయితే ఇప్పుడిడప్పుడే తిరుమలతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 22,382 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 10,889 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రాకతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.33 కోట్లు వచ్చింది.