బ్రేకింగ్ : జగన్ ఆరా… సిక్కోలుకు అంటుకోవడానికి?
దాదాపు నెల రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రవేశించలేదు. నెల రోజుల నుంచి కరనా కట్టడికి అక్కడి [more]
దాదాపు నెల రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రవేశించలేదు. నెల రోజుల నుంచి కరనా కట్టడికి అక్కడి [more]
దాదాపు నెల రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రవేశించలేదు. నెల రోజుల నుంచి కరనా కట్టడికి అక్కడి అధికార యంత్రాంగం తీవ్రంగానే శ్రమించింది. అయితే తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో శ్రీకాకుళం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకూ కరోనా రహిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో మూడు కేసులు నమోదవ్వడంతో దాని కాంటాక్టును అధికారులు పరిశీలిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వలసకార్మికులు, మత్స్యకారులు రావడంతో వారి వల్ల వైరస్ వచ్చిందా? అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి కుటుంబీకులకు ఈ వ్యాధి సోకినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఆరా తీసినట్లు తెలిసింది. ఏపీలోని పదమూడు జిల్లాల్లో 12 జిల్లాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఒక్క విజయనగరం జిల్లాలో నేటికీ ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాలేదు.