బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా… 24 గంటల్లో 80 మందికి?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తుంది. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే ఏపీలో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో [more]

;

Update: 2020-04-27 06:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తుంది. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే ఏపీలో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,177కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో 31 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఏపీలో 911 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ హెల్త్ బులిటెన్ వెల్లడించింది. కొత్తగా నమోదయిన కేసుల్లో రాజ్ భవన్ లో పనిచేస్తున్న నలుగురి సిబ్బందికి కరోనా సోకింది. కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరు జిల్లాలో 237, కృష్ణా జిల్లాలో 210 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.

Tags:    

Similar News