మాస్కుల ధరించని వారి నుంచి 37.94 కోట్లు
కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు శాఖతో పాటు వైద్య శాఖ తమ నివేదికను కోర్టుకు సమర్పించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన [more]
కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు శాఖతో పాటు వైద్య శాఖ తమ నివేదికను కోర్టుకు సమర్పించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన [more]
కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు శాఖతో పాటు వైద్య శాఖ తమ నివేదికను కోర్టుకు సమర్పించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డిజిపి తన నివేదికలో పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం కఠినమైన చర్యలు తీసుకొని కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాటిస్తున్నామని వైద్య శాఖ కోర్టుకు నివేదించింది. ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 160 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేశామని చెప్పారు. మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు, రూ.37.94 కోట్ల జరిమానా విధించినట్లు డీజీపీ తెలిపారు. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు నమోదు చేశామాన్నారు. అలాగే లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు పెట్టామని ఆయన కోర్టుకు తెలిపారు.