బ్రేకింగ్ : సంచలన తీర్పు.. 38 మందికి మరణశిక్ష
2008 అహ్మదాబాద్ వరస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 38 మందికి మరణశిక్ష విధించింది.
2008 అహ్మదాబాద్ వరస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి మరణశిక్ష విధించింది. అహ్మాదాబాద్ నగరంలో 2008లో వరస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు పదమూడేళ్ల తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. 38 మందికి మరణ శిక్ష విధించి సంచలన తీర్పు వెల్లడించింది.. ఈ కేసులో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారించింది.
2008లో....
2008లో అహ్మదాబాద్ సిటీలో దుండగులు 18 చోట్ల బాంబులు అమర్చారు. ఇవి కొన్ని చోట్ల పేలడంతో బాంబు దాడిలో 56ో మంది మృతి చెందారు. 200 మందికి గాయాలయ్యాయి. అయితే బాంబులను స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బస్ స్టేషన్లను టార్గెట్ గా చేసుకుని అమర్చారు. జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు అమర్చారు. అయితే కొన్ని చోట్ల అమర్చిన బాంబులు పేలకుండా బాంబ్ స్క్వాడ్ అధికారులు నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దయెత్తున ప్రాణనష్టం తప్పింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు ఎట్టకేలకు వచ్చింది.