తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన పదిరోజుల తర్వాత ఓటమికి గల కారణాలను సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో ఆలస్యం జరగడం ఓటమికి ఒక కారణంగా ఆయన విశ్లేషించారు. నామినేషన్ కు గడువు దగ్గరపడుతున్నా అభ్యర్థులను ఖరారు చేయకుండా నాన్చుడు ధోరణిని అవలంబించడమే ఓటమికి ప్రధాన కారణంగా ఆయన వివరించారు.దీంతో పాటు కె.చంద్రశేఖర్ రావుతో ఎన్నికల సంఘం కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందన్నారు. పోలైన ఓట్లకంటే కౌంటింగ్ లో ఓట్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. కూటమిలో కొనసాగాలా? వద్దా? అన్నది జాతీయ నాయకులతో చర్చించి నిర్ణయిస్తామన్నారు.